నా తొలి ప్రేమ-01

మనం జీవితంలో ఎంతో మందిని కలుస్తుంటాం
కొంతమంది జీవితంలో ఉంటే
మరి కొంతమంది జ్ఞాపకాలలో వుంటారు
కొన్ని జ్ఞాపకాలు తీపి గుర్తులు అయితే
మరి కొన్ని చేదు గాయాలు
పుట్టగానే పూలవనం కాదు జీవితం అన్నాడు ఒక కవి.
ప్రతి మొక్క మనమే నాటలి అప్పుడే జీవితం పూలవనం అవుతుంది.
అందమయిన పూలవనం తన జీవితం అయితే
వికాసించే ప్రతి పువ్వు తన చిరునవ్వే.
అందమయిన ఆ రూపం చందమామకు ప్రతి రూపం,
చక్కని చిన్నది గుణంలో గొప్పది.
వ్యక్తితవం ఉన్నది మిక్కిలి మంచిది తనే నక్షత్ర.
చదువుతున్న నీకే తనని చూడాలి అనిపిస్తే మొదటి సారి తెలిసి తెలియని వయస్సులో
మొదటి సారిగా మా క్లాస్ లో
అందమయిన తన అమాయక మోకాన్ని చూస్తూ అలానే ఉండిపోయా.

ఇంతలోనీ ఒక పిలుపు అరే చందు మీ పిల్ల వెళ్ళిపోయి చాలా సేపు అయ్యిందిరా ఇక స్కూల్ కూడ అయిపోయింది ఇంటికీ వెళ్ళధామ్ పదా.
అదేంటో నా 10th క్లాస్ మొదటి రోజు నాకు తెలియకూడనే ఆమే ఊహల్లో ఉండిపోయా.
అదేంటి ఒక్క సారి చూడగానే ఊహల్లో తెలిపోయావా...
అవును ఊహల్లోనే వున్నాను ఎంతో మందిని చూసాను ఎంతో మందిని కలిశాను కానీ తనని మొదటి సారి చూసినపప్పుడు తన కళ్ళలో కనపడే ఆదరణ,తను పక్కన ఉంటే వచ్చిన ధైర్యం ,మన వారిని కలుసుకున్నాం అనే భావన ,ఇవి అన్ని నాలో కొత్త అనుభూతిని నింపాయి.

తన నుండి ఆలోచనల్ని తిప్పులేకపోతున్న
ప్రతి నిమిషం ఆమే కోసమే ఆలోచిస్తున్న...
అమ్మ పిలుస్తున్న ,నాన్న తిడుతున్న,పూస్తుకం చదువుతున్న కూడా ప్రతి అక్షరం వెనుక ఆమే రూపమే.
ఇంతలా నా ఆలోచనల్ని ,నా మనస్సు ని తన వైపు తిప్పుకున్న తనని ఎలా  అయినా రేపు అడగాలి
ఒక్క చూపులో నన్ను ఇంతలా మార్చేచిసిన తన కళ్ళతో నేను మాట్లాడాలి,నన్ను ఇలా మార్చేసిన తన అందాన్ని పలకరించాలి.
కానీ భయం వేస్తోంది తన అందం ముందు తను నన్ను ఎం అనుకుంటది
ఎదురుగా వెళ్లి కలిసేనా...?
బస్టాండ్ లో కలిసేనా...?
స్కూల్ లో మాట్లాడేనా...?
ఒకవేళ మాట్లాడితే తీసుకువెళ్లి ప్రిన్సిపాల్ కి చెపితే మళ్ళీ ప్రాబ్లమ్ అయితె మరి ఎలా కలవాలి తనని...??
రాత్రి అంతా ఆమే గురించే ఆలోచన ఒకవేళ కలిస్తే ఏమని మాట్లాడాలి...?
ఇలాంటి ఆలోచనలతో నాకు తెలియకుండానే నిద్రలోకి వెళ్లిపోయా...
ఒక్కసారిగా అమ్మ రేయ్ ఇప్పటికీ లేట్ అయ్యింది లేచి స్కూల్ కి పోరా అని అనగానే ఈరోజు నక్షత్రని కలవాలి అని
తొందరగా లేచాను తనని చూడాలి అనే తొందరలో టిఫిన్ కూడా చేయకుండా స్కూల్ కి వచ్చాను. తను నడుచుకుంటూ స్కూల్ కి వస్తుంది పక్కన వాళ్ళ డాడీ వున్నాడు.ఆమేకు వాళ్ళ డాడీ అంటే చాలా ఇష్టం అనుకుంటా ఎప్పుడు చూసినా ఆయన చెయ్యి పట్టుకొని నడుస్తుంది.ఆయనకి చాలా కోపం ఎక్కువ అందమయిన కూతురికి తండ్రి అనే పొగరు కూడా ఎక్కువే కానీ కూతురు అంటే ప్రాణం.అందుకే నక్షత్రకి వాళ్ళ నాన్న అంటే చాలా ఇష్టం.
నక్షత్ర గురించి చెప్తావ్ అనుకుంటే వాళ్ళ నాన్న గురించి చెప్తావ్ ఏంటి అని నీకు అనిపించవచ్చు...
కానీ నాకు మాత్రం చేయి పట్టుకొని నడిపించిన నాన్నే తను అంతలా ప్రేమిస్తే
జీవితాంత చెయ్యి పట్టుకొనే నన్ను ఇంకెంత ప్రేమిస్తాదో అనుకున్న.నాకు తెలియకుండానే తనని నేను గౌరవిస్తున్న.తను క్లాస్ లోకి వచ్చింది కలిసి మాట్లాడుదాం అనుకున్న కానీ
ఒకవైపు భయం...?
నన్ను ఎందుకు నీ ఆలోచనలో బంధించావ్ అని అడగాలి అనుకున్న కానీ తను ఎదురు పడితే ఎం మాట్లాడాలో కూడా అర్ధం కావట్లేదు.ఏదో తెలియని అలజడి వెంటబడి తరువుతున్నట్లు ఉంది.గుండె వేగం పెరిగింది మాట్లాడకపోతే సచిపోయేలా ఉన్న.తన ఎదురుగా వెళ్ళాను హయ్ నక్షత్ర అన్నాను.
తను నాతో మాట్లాడటానికి భయపడుతుంది నాకు దూరం గా వెళ్ళిపోయింది.
తన భయానికి కారణం ఏమిటో అర్థం కాలేదు...?
తను ఎందుకు దూరం గా వెళ్ళిపోయిందో కూడా తెలియదు...?
ఇంతలోనే స్కూల్ బెల్ అయ్యింది.
ఇంటికి వెళ్తున్న కానీ నా ఆలోచనలు అన్నీ స్కూల్ మీదనే ఉన్నాయి .
తను ఎందుకు అలా వెళ్ళిపోయింది...?
తనని నా ఆలోచలో నుండి ఎందుకు వేయలేకపోతున్నాను...?
ఇంతలోనే సాయి గాడు అరే ఎందుకు రా ఆమే గురించి అంతలా ఆలోచిస్తున్నావ్..
ఇంతకీ నీది ప్రేమ..?
ఎట్రాక్షన్ హా...?
వాడు వేసిన ఈ ప్రశ్న నాలో కొత్త ఆలోచనల్ని పుట్టించింది..


నోట్:   ఒంటరిగా వున్నారని బాధ పడకండి. మీరు ఎవరితో పంచుకోని భావాలు మరియు అన్‌టోల్డ్  ఫీలింగ్స్‌ను, మీరు ఎప్పుడు ఎవరికీ  చెప్పని  మీ ప్రేమ కథను,మీ లవ్ లో ఎవైనా  సమస్యలు వుంటే అవి మాతో పంచుకొండి.మేము మా వెబ్‌సైట్‌లో మీ ప్రేమ కథని పోస్ట్ చేస్తాము.మీ ప్రేమ కథను ఈ ప్రపంచానికి మా ద్వారా తెలియజయండి. మెయిల్ ఐడి: techtube523@gmail.com
డైలీ అప్డేట్@ 12:00 pm
యూట్యూబ్ ఛానల్ ఫాలో అవ్వండి:https://www.youtube.com/channel/UCAhzoLcgQgB4uKDC9WohapA

Comments

Popular posts from this blog

Dear Condom

DEAR RAIN

Dear Magical girl